Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 63

Viswamitra and Menaka !!

|| om tat sat ||

బాలకాండ
అఱువది మూడవ సర్గము

పూర్ణేవర్ష సహస్రేతు వ్రతస్నానం మహామునిమ్ |
అభ్యాగచ్ఛన్ సురాస్సర్వే తపః ఫలచికీర్షవః ||

స|| సహస్ర వర్ష పూర్ణే వ్రత స్నానం తు మహామునిమ్ తపః ఫల చికీర్షవః సురాః సర్వే అభ్యాగచ్ఛన్ ||

తా|| వేయిసంవత్సరములు వ్రతము పూర్తి అయిన పిమ్మట స్నానము ఒనర్చిన మహామునికి తపస్సుయొక్క ఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ విచ్చేసిరి.

అబ్రవీత్ సుమహాతేజా బ్రహ్మా సురుచిరం వచః |
ఋషిత్వమసి భద్రంతే స్వార్జితైః కర్మభిః శుభైః ||

స|| బ్రహ్మా సు మహాతేజా సురుచిరం వచః అబ్రవీత్ | భద్రం తే| ఋషి త్వమసి స్వార్జితైః కర్మభిః శుభైః ||

తా|| మహాతేజస్వి అయిన బ్రహ్మ రుచికరమైన వచనములతో ఇట్లు పలికెను. " నీకు భద్రము అగు గాక . నీవు స్వార్జితమైన శుభమైన కర్మలు ఆచరించి ఋషిత్వము పొందితివి".

తమేవముక్త్వా దేవేశః త్రిదివం పునరభ్యగాత్ |
విశ్వామిత్రో మహాతేజా భూయస్తేపే మహాతపః||

స|| తం ఏవం ఉక్త్వా దేవేశః త్రిదివం పునః అభ్యగాత్ | భూయః విశ్వామిత్రః మహాతపః తేపే ||

తా|| 'ఈ విథముగా చెప్పి దేవతల అధిపతి అయిన బ్రహ్మ మరల వెళ్ళిపోయెను. మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు మరల మహాతపస్సు ను చేసెను'.

తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః |
పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే ||

స|| హే నరశ్రేష్ఠ ! తతః మహతా కాలేన పరమ అప్సరాః మేనకా పుష్కరేషు స్నాతుం సముపచక్రమే |

తా|| 'ఓ నరశ్రేష్ఠా ! పిమ్మట కొంతకాలమునకు అప్సరస అయిన మేనక ఆ పుష్కరములో స్నానము చేయ సాగెను'.

తాం దదర్శ మహాతేజా మేనకాం కుశికాత్మజః |
రూపేణాప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా ||

స|| మహాతేజా కుశికాత్మజః రూపేణ అప్రతిమం జలదే విద్యుతం యథా తాం మేనకాం దదర్శ ||

తా||' అప్పుడు మహాతేజోవంతుడైన కుశికాత్మజుడు అప్రతిమమైన రూపము గల , నీటిలో విద్యుత్కాంతివంటి ఆ మేనకను చూచెను'.

దృష్ట్వా కందర్పవశగో మునిః తాం ఇదమబ్రవీత్ |
అప్సరః స్వాగతం తే అస్తు వసచేహ మమాశ్రమే ||

స|| కందర్ప వశగో మునిః తాం దృష్ట్వా ఇదం అబ్రవీత్ | అప్సరః తే స్వాగతం అస్తు | ఇహ మమాశ్రమే వస చ ||

తా|| 'మోహవశుడైన ఆ ముని ఆమెను చూచి ఇట్లు పలికెను. "ఓ అప్సరసా నీకు స్వాగతము. ఐక్కడ నా ఆశ్రమములో ఉండుము".

అనుగృహీష్వ భద్రం తే మదనేన సుమోహితమ్ |
ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్ ||

స|| భద్రం తే | సుమోహితం (మాం) అనుగృహీష్వ | ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసం అథాకరోత్ |

తా|| " నీకు భద్రము అగుగాక | మోహపరవశుడనైన నన్ను అనుగ్రహించుము". ఇట్లు చెప్పబడిన ఆ అప్సరస ఆ ఆశ్రమములో నివశించ సాగెను'.

తస్యాం వసంత్యాం వర్షాణి పంచ పంచ రాఘవ |
విశ్వామిత్రాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రముః ||

స|| హే రాఘవ | తస్యాం వసంత్యాం పంచ పంచ వర్షాణి హే రామ విశ్వామిత్ర ఆశ్రమే సుఖేన వ్యతిచక్రముః |

తా|| 'ఓ రాఘవ ! పది సంవత్సరముల వసంతములలో ఆమె విశ్వామిత్రుని ఆశ్రమములో సుఖముగా గడిపెను'.

అథకాలే గతే తస్మిన్ విశ్వామిత్రో మహామునిః|
సవ్రీడ ఇవ సంవృత్తః చింతాశోకపరాయణః ||

స|| అథ కాలే గతే విశ్వామిత్రః మహామునిః సవ్రీడ ఇఅవ సంవృత్తః చింతాశోకపరాయణః అభవత్ |

తా|| 'అట్లు కాలము గడిచిన పిమ్మట మహాముని అయిన విశ్వామిత్రుడు తపస్సు భంగపడినందుకు చింతాశోకపరాయణుడు అయ్యెను'.

బుద్ధిః మునేః సముత్పనా సామర్షా రఘునందన |
సర్వం సురాణాం కర్మైతత్ తపోపహరణం మహత్ ||

స|| హే రఘునందన ! ఏతత మహత్ తపోపహరణం సర్వం సురాణాం కర్మః (ఇతి) మునేః బుద్ధి సముత్పనా||

తా||' ఓ రఘునందన ! ఇది మహత్తరమైన తపస్సు అపహరించుటకు దేవతలు అందరూ చేసిన పని అని మునికి అలోచనవచ్చెను'.

అహోరాత్రాపదేశేన గతా సంవత్సరా దశ |
కామమోహాభి భూతస్య విఘ్నో అయం ప్రత్యుపస్థితః ||

స|| అహో అపదేశేన సంవత్సరా దశ రాత్రా గతా | కామమోహాభిభూతస్య అయం విఘ్నః ప్రత్యుపస్థితః ||

తా|| " అహో ఈ అపచారము వలన పది సం త్సరములు ఒక రాత్రివలే జరిగిపోయినవి".

వినిశ్శ్వసన్ మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః |
భీతా మప్సరసం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితామ్ ||
మేనకాం మధురైర్వాక్యైః విసృజ్య కుశికాత్మజః |
ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామ హ ||

స|| వినిశ్శ్వసన్ మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః అభూత్ | వేపంతీం ప్రాంజలిం భీతా మేనకాం అప్సరసం దృష్ట్వా మధురైర్వాక్యైః విశ్రుజ్య చ |హే రామ ! విశ్వామిత్రః ఉత్తరం పర్వతం జగామ హ ||

తా|| 'ఈవిధముగా చింతించుచూ పశ్చత్తా పము తో దుఃఖితుడు అయ్యెను. అప్పుడు భయముతో వణుకుచూ అంజలిఘటించిన అప్సరస మేనకను చూచి మధురమైన వచనములతో అమెను పరిత్యజించెను. ఓ రామ ! అప్పుడు ఉత్తర దిశలో ఉన్న పర్వతమునకు పోయెను'.

సకృత్వా నైష్ఠికీం బుద్ధిం జేతు కామో మహాయశాః |
కౌశికీతీరామాసాద్య తపస్తేపే సుదారుణం ||

స|| మహాయశాః కామో జేతుః బుద్ధిం సకృత్వా కౌశికీతీరమాసాద్య సుదారుణమ్ నైష్ఠికీం తపః తేపే ||

తా|| 'ఆ మహా యశోవంతుడు కామమును జయించుటకు నిశ్చయించుకొని కౌశికీ నదీ తీరములో దారుణమైన తపస్సు నిష్ఠతో చేసెను'.

తస్య వర్ష సహస్రంతు ఘోరం తప ఉపాసతః |
ఉత్తరే పర్వతే రామ దేవతానం అభూత్భయమ్||

స|| హే రామ ! ఉత్తరే పర్వతే సహస్రం వర్ష ఘోరం తప ఉపాసతః తస్య దేవతానాం భయం అభూత్ ||

తా|| 'ఓ రామా ! ఉత్తరదిశలో పర్వతముపై వేయిసంవత్సరములు ఆచరించిన ఘోరమైన తపస్సు చూచి దేవతలు భయపడిరి'.

ఆమంత్రయన్ సమాగమ్య సర్వే సర్షిగణాస్సురాః |
మహర్షి శబ్దం లభతాం సాధ్వయం కుశికాత్మజః ||

స|| సర్వే సురాః స ఋషిగణాః సమాగమ్య ఆమంత్రయన్ కుశికాత్మజ మహ₹హిశబ్దం లభతాం సాధ్వయం||

తా|| 'ఆ దేవతలు అందరూ ఋషిగణములతో కలిసి ఈ కౌశికుడు మహర్షి పదము పొందుటకు అర్హుడు అని అనుకొనిరి.'

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః |
అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్ ||

స|| సర్వలోక పితామహం దేవతానాం వచః శ్రుత్వా తపోధనం విశ్వామిత్రం మధురం వాక్యం అబ్రవీత్ ||

తా|| 'సర్వలోక పితామహుడైన బ్రహ్మ ఆ దేవతల మాటలను విని తపోధనుడైన విశ్వామిత్రుని తో మధురమైన మాటలను చెప్పెను'.

మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః |
మహత్త్వమ్ ఋషిముఖ్యత్వం దదామి తవ కౌశిక ||

స|| హే కౌశిక ! వత్స తవ ఉగ్రేణ తపః తోషితః |మహర్షే స్వాగతం తవ | మహత్ ఋషిముఖ్యః త్వం దదామి |

తా|| "ఓ కౌశిక ! నాయనా ! నీ ఉగ్రమైన తపస్సుతో సంతోషపడితిని. ఓ మహర్షీ ! నీకు స్వాగతము. గొప్పదైన ముఖ్యమైన ఋషిత్వము నీకు ప్రసాదించుచున్నాను"

బ్రహ్మణస్సవచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య హ |
నవిషణ్ణో న సంతుష్ఠో విశ్వామిత్రః తపోధనః ||

స|| స సర్వలోకేశ్వరస్య బ్రహ్మణ వచః శ్రుత్వా తపోధనః విశ్వామిత్రః న విషణ్ణో న సంతుష్ఠో అభవత్ |

తా|| 'అ సర్వలోక మహేశ్వరుడైన బ్రహ్మ వచనములను విని సంతుష్ఠుడు అవలేదు దుఃఖితుడు అవలేదు'.

ప్రాంజలిః ప్రణతో భూత్వా సర్వలోక పితామహమ్|
ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః ||

స|| సర్వలోకపితామహమ్ ప్రాంజలిః ప్రణతః భుత్వా తతః మహామునిః విశ్వామిత్రః వాచం ప్రత్యువాచ ||

తా|| 'సర్వలోక ములకు పితామహునికి అంజలి ఘటించి నమస్కారము చేసి పిమ్మట మహాముని అయిన విశ్వామిత్రుడు సమాధానము చెప్పుచూ ఇట్లు పలికెను'.

మహర్షిశబ్దమతులం స్వార్జితైః కర్మభిశ్శుభైః |
యది మే భగవానాహ తతోsహం విజితేంద్రియః ||

స|| యది స్వార్జితం శుభైః కర్మభిః అతులం మహర్షి శబ్దం భగవాన్ ఆహ తతః అహం విజితేంద్రియః (ఇతి) ||

తా|| " స్వార్జితమైన శుభకరమగు కర్మలతో సంతుష్టుడై నన్ను మహర్షి అను శబ్దము భగవన్ పలికినచో , అప్పుడు నేను జితేంద్రియుని కదా " అని!

తం ఉవాచ తతో బ్రహ్మ న తావత్ జితేంద్రియః |
యతస్వ మునిశార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః ||

స|| తతః బ్రహ్మ తం ఉవాచ | న తావత్ జితేంద్రియః | మునిశార్దూల యతస్వ | ఇత్యుక్తా త్రిదివం గతః ||

తా|| 'అప్పుడు బ్రహ్మ అతనికి చెప్పెను. " ఓ మునిశార్దూల ! జితేంద్రియుడవని భావింపవలదు. ఇంకనూ ప్రయత్నము చేయుము". ఇట్లు చెప్పి తన దేవలోకమునకు పోయెను'.

విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః |
ఊర్ధ్వబాహుః నిరాలంబో వాయుభక్షః తపశ్చరన్ ||

స|| దేవేషు విప్రస్థితేషు మహామునిః విశ్వామిత్రః నిరాలంబో ఊర్ధ్వభాహుః వాయుభక్షః తపః చరన్ ||

తా|| 'దేవతలు అందరూ వెళ్ళిన పిమ్మట, మాహాముని అయిన విశ్వామిత్రుడు ఆలంబనము లేకుండా, బాహువులు పైకి ఎత్తి వాయువునే ఆహారము గా గైకొని తపము ఆచరించెను'.

ఘర్మే పంచతపాభూత్వా వర్షాకాససంశ్రయః |
శిశిరే సలిలస్థాయీ రాత్యహాని తపోధనః |
ఏవం వర్ష సహస్రం హి తపో ఘోరముపాగమత్ ||

స|| ఘర్మే పంచ తపాభుత్వా వర్షాత్ ఆకాశ సంశ్రయః శిశిరే సలిల స్తాయీ రాత్రి అహని తపోధనః తపః తేపే| ఏవం సహస్ర వర్షం ఘోరతపం ఉపాగమత్ హి ||

తా|| 'వేసవికాలములో పంచ అగ్నులమధ్యలో, వర్షాకాలములో ఆకాశమునే ఆశ్రయముగా చేసుకొని, శిశిరములో నీటిలో నుంచుని ఆ తపోధనుడు రాత్రింబవళ్ళు తపస్సు చేసెను. ఈ విథముగా వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపస్సు ఆచరించెను'.

తస్మిన్ సంతప్యమానేతు విశ్వామిత్రే మహామునౌ |
సంభ్రమః సుమహానాసీత్ సురాణాం వాసవస్య చ ||

స|| విశ్వామిత్రే మహామునౌ సంతప్య మానేతు తస్మిన్ సురాణాం వాసవస్య చ సంభ్రమః సుమహాన్ ఆసీత్ ||

తా|| 'మహాముని యగు విశ్వామిత్రుడు అట్లు తపము చేయగా దేవతలు ఇంద్రుడు కూడా మహత్తరమైన సంభ్రమమునకు లోనైరి'.

రంభాం అప్సరసం శక్రః సర్వైర్మరుద్గణైః |
ఉవాచాత్మహితం వాక్యం అహితం కౌశికస్య చ ||

స|| శక్రః సర్వైర్మరద్గణైః రంభామ్ అప్సరసం ఆత్మహితం కౌశికస్య అహితం చ వాక్యం ఉవాచ ||

తా|| 'ఇంద్రుడు మరుద్గణములతో కూడి అప్సరస అయిన రంభను తమ హితముకోరకు కౌశికుని అహితము కొరకు అనగా తపస్సు భంగపరచుటకు ఇట్లు పలికెను.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిషష్టితమస్సర్గః ||

|| ఈ విథముగా రామాయణములో ని బాలకాండలో అరువది మూడవ సర్గము సమాప్తము||.

||ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||